![]() |
![]() |
.webp)
జబర్దస్త్ శుక్రవారం ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇందులో నూకరాజు - రష్మీ మధ్య ఆ కోపం ఇంకా చల్లారినట్టు లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ జబర్దస్త్ కి పాకింది. నూకరాజు స్కిట్ లో ముందుగా రష్మీ దగ్గరకు వెళ్లి "వుండు ఎంత సేపు ఉంటావో మాట్లాడకుండా..అసలు తప్పు నీది కాదు నాది కాదు ఆ అమ్మది. ఇలా నిప్పు గీసి అలా పెట్టేసింది. ఆ మంటలో నువ్వు, నేను కాలిపోయాం..కానీ మచ్చ మాత్రం నా మీద పడిపోయిందే..
ఆ ఇంట్లో గొడవలకు ఈ ఇంట్లో అలకేందుకే చిలక,. నాన్సెన్స్..ఏదో ఒకటి మాట్లాడు లేదంటే సూసైడ్ లెటర్ రాసి అందులో ఇద్దరి పేర్లు రాసి సూసైడ్ చేసుకుంటా ..నువ్వు ఇలాగే ఉంటె నేను జబర్దస్త్ వదిలేసి వెళ్ళిపోతా చూస్కో..చిలిపి మనిద్దరి మధ్య మొదలయిందని నాకు అర్ధమయ్యింది " అంటూ రష్మిని కాసేపు బుజ్జగించి, బతిమాలి, బామాలి చివరికి నవ్వించాడు నూకరాజు. ఇక నూకరాజు నాగేశ్వరావు గెటప్ లో, తాగుబోతు రమేష్ నాగార్జున గెటప్ లో వచ్చి అలరించారు. ఇలా ఈ వారం సరదా శుక్రవారంలో స్కిట్స్ అన్నీ అలరించాయి.
![]() |
![]() |